Perarivalan: పెరారివాలన్‌ అమ్మ ఎమోషనల్‌.. 30ఏళ్ల తర్వాత ఇంటికి కొడుకు.!

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి పెరరివాళన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Perarivalan: పెరారివాలన్‌ అమ్మ ఎమోషనల్‌.. 30ఏళ్ల తర్వాత ఇంటికి కొడుకు.!

|

Updated on: May 24, 2022 | 6:50 PM


మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి పెరరివాళన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెరరివాళన్‌ విడుదలతో ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఇతర దోషులకు విడుదలకు లైన్‌ క్లియర్ అయింది.అయితే 19ఏళ్ల వయసులో అరెస్టయ్యి, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల పెరారివాలన్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో ఆయన తల్లి అర్పుతం అమ్మాళ్ ఆనంధానికి అవధుల్లేవు. తన బిడ్డ అమాయకుడు అని వాదిస్తూ, ఏళ్ల తరబడి ఆమె చేసిన పోరాటం అంత తేలికైనదేమీ కాదు. ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా, న్యాయవ్యవస్థమీద విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడి విజయం సాధించిన గొప్ప తల్లి ఆమె. అందుకే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఆ మహాతల్లికి స్వర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us