Viral video: అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ..! తన ఆరోగ్య రహస్యం ఇసుకే అంటున్న బామ్మ..

తినే ఆహారపదార్ధంలో కొంచెం ఇసుక వస్తేనే తినేదానిని పక్కకు పెట్టి.. వండినవారిమీద ఓ రేంజ్ కోప్పడతాం.. కానీ ఓ బామ్మ మాత్రం ఇసుకని పంటి కింద పెట్టుకుని పంచదార తిన్నట్లు తినేస్తుంది. అది రోజుకి కిలోలు కిలోలు తింటూ అందరికి షాక్ ఇస్తుంది. అంతేకాదు....

Viral video: అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ..! తన ఆరోగ్య రహస్యం ఇసుకే అంటున్న బామ్మ..

|

Updated on: Dec 08, 2021 | 5:02 PM

తినే ఆహారపదార్ధంలో కొంచెం ఇసుక వస్తేనే తినేదానిని పక్కకు పెట్టి.. వండినవారిమీద ఓ రేంజ్ కోప్పడతాం.. కానీ ఓ బామ్మ మాత్రం ఇసుకని పంటి కింద పెట్టుకుని పంచదార తిన్నట్లు తినేస్తుంది. అది రోజుకి కిలోలు కిలోలు తింటూ అందరికి షాక్ ఇస్తుంది. అంతేకాదు గత 60 ఏళ్లుగా ఇసుకనే ఆహారంగా తింటున్నానని చెబుతుంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వృద్ధురాలు కుష్మావతి దేవి. ఈ బామ్మ రోజుకి రెండు కిలోల ఇసుకని తింటుంది. అయినా ఆరోగ్యంగా ఉంది. ఇదే విషయం ఆ బామ్మని అడిగితె.. బోసినోరుతో చిరునవ్వు నవ్వుతు.. అసలు నేను ఏ రోగం లేకుండా ఇలా ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం.. ఇసుకే అంటుంది. ఇసుక తినడమే.. నా ఆరోగ్య రహస్యం అంటూ చెబుతుంది. ఈ వింత అలవాటుని చూసి షాక్ తింటున్నారు. మరో విచిత్రమేంటంటే.. డాక్టర్లే తనని ఇసుక తినమని చెప్పారంటోంది ఈ బామ్మ.

కుష్మావతి దేవి టీనేజ్ లో ఉండగా.. భరించలేని కడుపునొప్పి వస్తే.. వైద్యులు కొంచెం బూడిద తినమని చెప్పారట. అప్పుడు కొంచెం బూడిద తినడం మొదలు పెట్టి.. తర్వాత ఇసుకని తినడం మొదలు పెట్టిందట.. అప్పుడు మొదలైన ఈ ఇసుకని తినే అలవాటు ఇప్పటికీ మానలేదు. కుష్మావతి టిఫిన్ తినడం లెట్ అయినా ఫీల్ అవదు కానీ.. ఇసుకని మాత్రం రోజుకి మూడుపూటలా సంతృప్తిగా తింటుంది. అయితే ఇసుకని తినే ముందు.. దానిని శుభ్రం చేసుకుని.. నీటిలో కడిగి అప్పుడు తింటుందట.అయితే బామ్మగారి ఇసుక అలవాటుని మాన్పించడానికి ఫ్యామిలీ మొత్తం ప్రయత్నించడంతో.. ఏకంగా కొడుకులను, మనవళ్లను వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న 75 ఏళ్ల బామ్మ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తనపనులు తాను చేసుకోవడమే కాదు.. పొలం పనులు కూడా చేస్తుంది. మొత్తానికి తన స్పెషల్ మెనూతో ఈ బామ్మ హాట్ హాట్ టాపిక్ గా మారింది.

Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..