Trending Video: వామ్మో.. తాడిఎత్తు లేచి ఆడుతున్న నాగుపాము.. చూస్తే వణుకుపుట్టాల్సిందే.. ఇంత పెద్దపామును ఇప్పటి వరకు చూసి ఉండరు..

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటిని అంత దూరాన చూడగానే భయంతో పారిపోతాం. అలాంటిది మీరు ఊహించని విధంగా ఓ పెద్ద నాగుపాము కనిపిస్తే ఎలాఉంటుంది..

Anil kumar poka

|

Aug 16, 2022 | 6:59 PM


సాధారణంగా పాములంటే అందరికీ భయమే. వాటిని అంత దూరాన చూడగానే భయంతో పారిపోతాం. అలాంటిది మీరు ఊహించని విధంగా ఓ పెద్ద నాగుపాము కనిపిస్తే ఎలాఉంటుంది.. ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. మనం ఎప్పుడూ చూడని పాములు సైతం నెట్టింట దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో సీన్‌ చూస్తే గుండె దడదడలాడకమానదు. ఇప్పటివరకూ ఇలాంటివి సినిమాల్లోనే చూసాం. కానీ ఇప్పడు నిజంగా కళ్లముందు ప్రత్యక్షమైంది. చూడ్డానికి అది మైదాన ప్రాంతంలా ఉంది. ఓ వైపు అంతా పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉన్నాయి. మరోవైపు ఓ చిన్నపాటి లోయలాంటి ప్రదేశం.. మధ్యలో సన్నని కాలిబాటలా ఉంది. ఈ లోయలోంచి ఓ భారీ నాగుపాము తాడిచెట్టంత ఎత్తుకు లేచి నిలబడి ఆడుతుంది. ఇంతకు ముందెన్నడూ ఇంత పెద్దపామును చూసి ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లకు వణుకుపుట్టిస్తోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు ఇంత పెద్ద పామును జీవితంలో చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu