బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి ఆలూ చిప్స్ !! రుచి చూడగా దెబ్బకు షాక్ !!

ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. విషయానికొస్తే.. అమెరికాలోని ఇల్లినోయిస్‌కు చెందిన రోబ్ అనే వ్యక్తి..

Phani CH

|

May 05, 2022 | 9:56 AM

ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. విషయానికొస్తే.. అమెరికాలోని ఇల్లినోయిస్‌కు చెందిన రోబ్ అనే వ్యక్తి.. తన బాత్రూమ్ గోడను రెనొవేట్ చేసే క్రమంలో మెక్‌డొనాల్డ్స్ బ్యాగ్‌ను కనుగొన్నాడు. మొదటిగా ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. 60 ఏళ్ల నాటి బ్యాగ్‌ తెరిచి చూడగా అందులో ఓ కాగితంలో ఫ్రెంచ్ ఫ్రైస్ చుట్టి ఉన్నట్లు గుర్తించాడు.. ఇక వాటిని తిని చూడగా అవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయని అతడికి అర్ధమైంది. ఇదే విషయాన్ని రోబ్ నెటిజన్లతో పంచుకున్నాడు. 1959వ సంవత్సరంలో తమ ఇంటిని కట్టామని.. ఆ సమయంలో ఓ మెక్‌డొనాల్డ్ షాప్ తమకు దగ్గరలోనే ఉండేదని రోబ్ చెప్పుకొచ్చాడు. ఇంటిని నిర్మించే బిల్దర్స్ ఎవరైనా.. ఈ చిప్స్ బ్యాగ్‌ను తీసుకొచ్చి ఉంటారని రోబ్‌ తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu