Face book love: ఫేస్‌ బుక్‌లో ప్రేమ.. పెళ్లి సమయానికి షాకింగ్ ట్విస్ట్.! అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

కర్ణాటకలోని మాండ్యా జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. జీవితం గురించి ఎన్నో, ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఆమెను విడిచి బతకడం సాధ్యం కాదని యువకుడు...

Face book love: ఫేస్‌ బుక్‌లో ప్రేమ.. పెళ్లి సమయానికి షాకింగ్ ట్విస్ట్.! అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

|

Updated on: May 28, 2022 | 8:45 PM


కర్ణాటకలోని మాండ్యా జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. జీవితం గురించి ఎన్నో, ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఆమెను విడిచి బతకడం సాధ్యం కాదని యువకుడు డిసైడైపోయాడు. ఆమెను కలిసి ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే తనను కలవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.. తల్లిదండ్రులకు తెలిస్తే గొడవైపోద్దని చెప్పింది. అయితే, ఆమెపై పెంచుకున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువకుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా సరేనంది. పెళ్లి గురించి మాట్లాడటానికి తన పినతల్లిని పంపుతున్నట్టు అతనికి చెప్పింది.అనుకున్నట్టుగానే ఆమె పినతల్లి అతని ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి ఖాయం అనుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు పెళ్లి ఖర్చులకోసమని ఆమె చేతిలో మూడున్నర లక్షలు పెట్టాడు. ఓ మఠంలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి వచ్చిన యువతి ‘పినతల్లి’.. పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ హతాశులయ్యారు. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులే విస్తుపోయారు. ఫేస్‌బుక్‌లో యువకుడికి పరిచయమైన ఆ యువతి ఈ ‘పిన్నమ్మే’నని తెలిసి అవాక్కయారు. వారే కాదు.. విషయం తెలిసిన యువకుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని బోల్తా కొట్టించినట్టు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో రాజీ కుదిరింది. కథ సుఖాంతమైంది. అర్ధమైందిగా.. ఫేస్‌బుక్‌ పెళ్లిళ్లంటే ఇలాగే ఉంటాయి మరి.. జాగ్రత్త..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Follow us