చుట్టూ మంటలు.. అలా బయటపడ్డాం వీడియో

Updated on: Oct 26, 2025 | 1:09 PM

కర్నూలులో ఓ ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం జరిగి పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సు వదిలి పారిపోయాడని బాధితులు ఆరోపించారు. మంటలు, పొగ వ్యాపించడంతో ప్రయాణికులు అద్దాలు, ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం గాయపడిన వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్నూలు శివార్లలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఆరు నుంచి ఏడు మందికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం ఒక బైక్‌ను ఢీకొట్టడం వల్ల జరిగిందని, ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. డ్రైవర్ బస్సును ఆపి, డోర్ తీసి పారిపోవడంతో ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోయారు. పొగ, మంటల తీవ్రత పెరగడంతో, ప్రయాణికులు అద్దాలు, ఎమర్జెన్సీ డోర్‌లను పగలగొట్టి బయటపడ్డారు. కొందరు ప్రయాణికులు నిద్రలో ఉండటం వల్ల బయటకు రాయలేకపోయారని, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తాతని.. అని చెబితే పంపేస్తారా? వీడియో

స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్‌గేట్స్ వీడియో

బ్యాంకులో మోగిన అలారం.. దొంగలు పరార్ వీడియో

Published on: Oct 26, 2025 12:50 PM