చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయ్యాక అమ్మానాన్నల చెంతకు చేరినవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా టెక్సాస్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఒకామె 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసింది. దాంతో, ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.1971 ఆగష్టు 23న 21 నెలల వయసున్న మెలిస్సా హైస్మిత్‌ను బేబీ సిట్టర్ కిడ్నాప్ చేసింది. బేబీ సిట్టర్ ఆచూకీ తెలపండని మెలిస్సా తల్లి న్యూస్పేపర్లో ప్రకటన కూడా వేయించింది. అంతేకాదు బేబీ సిట్టర్ కోసం చాలా చోట్ల వెతికారు. కానీ, లాభం లేకపోయింది. దాంతో, వాళ్లు మెలిస్సాను తలచుకుంటూనే గడపసాగారు. అయితే ఈ మధ్యే వాళ్ల నిరీక్షణ ఫలించింది. 51 ఏళ్ల తర్వాత వాళ్లు తమ కూతురు మెలిస్సాను మొదటిసారిగా చూశారు. మెలిస్సా తమ కూతురే అని నిర్ధారించడంలో డీఎన్ఏ పరీక్ష ఫలితాలు, ఆమె పుట్టిన తేదీ, ఆమె శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆధారమయ్యాయి. నవంబర్ 26న మెలిస్సా తన అమ్మానాన్న, ఇద్దరు తోబుట్టువులను ఫోర్ట్ వర్త్ చర్చిలో కలుసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..