Idli-Dosa names: ఇడ్లీ, దోశల పేర్లు మారాయి.. ఇకపై అలానే ఎందుకో..? ఎక్కడో.? మిరే చూడండి..

అమెరికాలోని ఇండియన్ క్రీప్ కో.. అనే భారతీయ రెస్టారెంట్ దక్షిణ భారత వంటకాలకు చాలా విచిత్రమైన పేర్లను పెట్టింది. ఈ రెస్టారెంట్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..

Idli-Dosa names: ఇడ్లీ, దోశల పేర్లు మారాయి.. ఇకపై అలానే ఎందుకో..? ఎక్కడో.? మిరే చూడండి..

|

Updated on: Jul 23, 2022 | 8:56 AM


అమెరికాలోని ఇండియన్ క్రీప్ కో.. అనే భారతీయ రెస్టారెంట్ దక్షిణ భారత వంటకాలకు చాలా విచిత్రమైన పేర్లను పెట్టింది. ఈ రెస్టారెంట్ మెనూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రజలు రెస్టారెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో సౌత్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. అయితే వాటి పేరు మార్చారని తెలుస్తోంది. ఇడ్లీ , దోస, గారెలు ఇలాంటి ఆహారపదార్ధాలను ఈ రెస్టారెంట్‌ సరికొత్త పేర్లతో కస్టమర్స్ కు అందిస్తోంది.వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో.. ఈ రెస్టారెంట్‌లోని సాదా దోసకు ‘నేకెడ్ క్రేప్’ అని పేరు పెట్టగా, మసాలా దోసకి ‘స్మాష్డ్ పొటాటో క్రేప్’ అని పేరు పెట్టారు. ఇక ఇడ్లీ- సాంబార్‌కు ఇక్కడ డంక్డ్ రైస్ కేక్ డిలైట్ అని పేరు పెట్టారు. సాంబార్ వడకి కూడా డంకెడ్ డోనట్ డిలైట్ అంటూ సరికొత్త నామకరణం చేశారు. ఈ వింత పేర్లను తెలుసుకున్న స్తానిక ప్రవాసాంధ్రులతో పాటు.. ఆ టిఫిన్స్ ను ఇష్టంగా తినే భారతీయులు ఆశ్చర్యపోయారు. రెస్టారెంట్‌లోని ఈ వింత మెనూ పేర్ల స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వింత పేర్లను తెలుసుకుని కొందరు విచారం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఇలాంటి రెస్టారెంట్లను ఇండియన్ రెస్టారెంట్లు అని పిలవకూడదని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us