Fishermen hunting: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. ఒక్కసారిగా బోటులో పడింది చూసి షాక్‌..(వీడియో)

సముద్రంలో రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. అనుకోకుండా అవి జాలర్లు, బోటు షికారుకు వెళ్లేవారికి కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో వారిపై దాడికి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Fishermen hunting: సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. ఒక్కసారిగా బోటులో పడింది చూసి షాక్‌..(వీడియో)

|

Updated on: Sep 25, 2022 | 9:41 AM

సముద్రంలో రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. అనుకోకుండా అవి జాలర్లు, బోటు షికారుకు వెళ్లేవారికి కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో వారిపై దాడికి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అలాంటి అనుభవమే ఎదురైంది. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. బ్రిటిష్‌ కొలంబియాలోని విక్టోరియా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి సముద్రంలో చిన్న బోటు వేసుకుని వెళ్లారు. ఇంతలో నీటి అడుగున ఏదో కలకలం రేగింది. కొన్ని కిల్లర్ వేల్స్ ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాయి. వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులు బోటు ఇంజన్ ను ఆపేశారు. జాగ్రత్తగా చుట్టూ గమనించారు. ఇంతలో వేగంగా ఈదుకుంటూ వచ్చి అమాంతం ఓ సీ లయన్‌ వారి బోటులో పడింది. ఇది నీటిలో తిరుగుతున్న కిల్లర్‌ వేల్స్‌ నుంచి తప్పించుకుంటూ వీరి బోటుపైకి దూకింది. భారీ సైజులో ఉండే ఆ సీ లయన్ బోటులో ఒకవైపు పడటంతో దాని బరువుకి పడవ పూర్తిగా వంగిపోయింది. దాదాపు బోల్తా పడినంత పని అయింది. బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నీటిలో పడిపోయారు. బోటుపై కాసేపు ఆగిన సీ లయన్.. బోటు ఓ పక్కకు వంగిపోవడంతో తిరిగి నీటిలోకి దూకేసింది. అయితే వారు బోటుతో తిరిగి సముద్రపు ఒడ్డుకు వస్తుంటే.. ఆ సీ లయన్ కూడా వెంట వచ్చింది. ఒడ్డుకు సమీపం దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. అయితే కిల్లర్ వేల్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాయని, తాము చాలా భయపడ్డామని బోటులోనివ్యక్తులు వెల్లడించారు. దగ్గరిలో మరో బోటులో వెళ్తున్నవారు ఈ దృశ్యాన్ని వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు