Uber Cab: ప్లీజ్‌ నన్ను అలా పిలవకండి.. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ విన్నపం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

డ్రైవర్ పక్కన ఉన్న సీటు హెడ్ రెస్ట్‌ దగ్గర ఓ అభ్యర్థన బోర్డు రాసి ఉంది.. నన్ను భయ్యా.. అంకుల్ అని పిలవకండి అని సందేశం రాసి అక్కడ అతికించాడు డ్రైవర్.. ఈ ట్విట్ ను ఉబెర్ ఇండియా ట్యాగ్ చేయగా కంపెనీ స్పందించింది.

Uber Cab: ప్లీజ్‌ నన్ను అలా పిలవకండి.. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ విన్నపం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

|

Updated on: Oct 07, 2022 | 9:59 AM


సాధారణంగా ఆటో లేదా క్యాబ్‌లలో ప్రయాణిస్తే దిగిన వెంటనే డ్రైవర్లకు థ్యాంక్స్‌ భయ్యా అని కృతజ్ఞతలు తెలుపుతాం.. ఎక్కువ వయస్సు ఉన్న డ్రైవర్లయితే థ్యాంకూ అంకుల్ అంటూ సంబోధిస్తారు. సరే.. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే మర్యాద.. గౌరవానికి సూచిక.. కానీ Uber డ్రైవర్ సీటుపై అతికించిన ఓ ఆసక్తిర సందేశం ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది. కానీ ఓ డ్రైవర్ భయ్యా, అంకుల్ అని పిలవద్దు అంటూ సీట్లకు ఓ పేపర్ అంటించాడు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగింది. ఓ క్యాబ్ లో ప్రయాణించిన ఓ వ్యక్తి.. తనకు ఎదురైన సంఘటనను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది .. ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇదంతా సరే.. మరి డ్రైవర్‌ను ఏమని పిలవాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ పక్కన ఉన్న సీటు హెడ్ రెస్ట్‌ దగ్గర ఓ అభ్యర్థన బోర్డు రాసి ఉంది.. నన్ను భయ్యా.. అంకుల్ అని పిలవకండి అని సందేశం రాసి అక్కడ అతికించాడు డ్రైవర్.. ఈ ట్విట్ ను ఉబెర్ ఇండియా ట్యాగ్ చేయగా కంపెనీ స్పందించింది. అనుమానం ఉంటే యాప్‌లో పేరును తనిఖీ చేయండి.. అని కంపెనీ నుంచి ట్వీట్ వచ్చినట్లు సోహిని ఎం అనే మహిళ తన ట్వీట్‌లో తెలిపింది.ఈ ట్వీట్ డ్రైవర్లను సంబోధించడానికి సరైన మార్గం ఏమిటి అనే చర్చకు కూడా దారితీసింది. “కార్పొరేట్ వ్యక్తులు ఒకరినొకరు సర్‌, మేడమ్‌ అని సంబోధిస్తారు. ఈ విషయంలో ఎందుకు అలా చేయకూడదు అంటున్నారు. తక్కువ ప్రొఫైల్ జాబ్‌లు చేసే వ్యక్తి.. కేవలం సాధారణ వ్యక్తిగా ఎందుకు ఉండాలంటూ ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. మరొకరు అందరినీ సార్, మేడమ్ అని పిలుద్దాం అంటూ వ్యాఖ్యానించారు. ఇంకొకరు నేను ప్రతి డ్రైవర్‌ను “డ్రైవర్ సాహబ్” అని పిలుస్తాను.. ఎందుకంటే నేను ఒకసారి ఇలా పిలిస్తే.. క్యాబ్‌ నడిపే వ్యక్తి చాలా ఉప్పొంగిపోయాడు. ఎందుకంటే అతని 20 ఏళ్ల సర్వీసులో అతనిని ఎవరూ సాహబ్ అని పిలవలేదట. వెంటనే అతను సంతోషిస్తూ కొన్ని నిమిషాలు నాతో మాట్లాడాడు. ఇది అంత ప్రభావం చూపుతుందని నేను గ్రహించలేదు” అంటూ మరొక వినియోగదారు ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని వేలాదిమంది లైక్ చేసి.. రీట్విట్ చేస్తున్నారు. ఇంకా ఏమని పిలవాలంటూ ఉబెర్ ఇండియాను ట్యాగ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి