ధైర్యం, కాస్త సమయస్పూర్తి ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చంటారు. ఈ వీడియో చూస్తే సరిగ్గా అలానే అనిపిస్తుంది. ఓ కుక్క అడవికి రాజైన సింహానికే వణుకు పుట్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలోని మైదాన ప్రాంతంలో ఆడ సింహం, మగ సింహం ప్రశాంతంగా పడుకుని సేద తీరుతున్నాయి. ఆ పక్కనే జీబ్రాల గుంపు గడ్డి మేస్తుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. ఓ కుక్క నేరుగా సింహాల వద్దకు వచ్చింది. వాటి ముందు నిల్చుని గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. దెబ్బకు సింహాలు జడుసుకుని పైకి లేచాయి. కుక్కపై దాడి చేసేందుకు సింహాలు ప్రయత్నించగా.. ఆ కుక్క మరింత రెచ్చిపోయి రివర్స్ అటాక్ చేసింది. వాటిని ఎగిరి ఎగిరి మరీ తన్నింది. కుక్క అరుపులకు సింహాలు రెండూ బెదిరిపోయాయి. ఒకానొక దశలో వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన కుక్క.. మళ్లీ వచ్చి సింహాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. కుక్క ఇచ్చిన ఝలక్‌కు బిత్తరపోయిన సింహాలు.. అక్కడి నుంచి పరుగులు తీశాయి. ఈ వీడియో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. కుక్క ధైర్యాన్ని, అది చేసిన రౌడీయిజాన్ని చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..