Coins in Man Stomach: కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని చూసి వైద్యుల షాక్.. పొట్టలో 187 నాణేలు..!

చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే హుండీలను పగులగొడితే.. చిల్లర నాణేలు బయటపడినట్లు.. ఓ వ్యక్తి కడుపులో నుంచి పెద్ద సంఖ్యలో నాణేలు కనిపించాయి. ఇప్పటి వరకు అతను రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మింగేశాడు.

Coins in Man Stomach: కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని చూసి వైద్యుల షాక్.. పొట్టలో 187 నాణేలు..!

|

Updated on: Dec 03, 2022 | 8:11 PM


చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే హుండీలను పగులగొడితే.. చిల్లర నాణేలు బయటపడినట్లు.. ఓ వ్యక్తి కడుపులో నుంచి పెద్ద సంఖ్యలో నాణేలు కనిపించాయి. ఇప్పటి వరకు అతను రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మింగేశాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. మొత్తం కలిపి ఒకటిన్నర కేజీకి చేరుకున్నాయి. చివరికి డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అతని కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను బయటకి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దయమప్ప హరిజన్‌. కొన్ని రోజులుగా ఈ నాణేలు మింగే డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. దీంతో ఇతని కడుపులోకి పెద్ద ఎత్తున నాణేలు పేరుకుపోయాయి. పొత్తికడుపులో నొప్పిగా ఉందని ఆస్పత్రికి రావడంతో అతనికి ఎక్స్‌రే, ఎండోస్కోప్‌లు చేశారు వైద్యులు. టెస్ట్‌ రిపోర్టులు అతని కడుపులో నాణేలు ఉన్నట్లు తెలిసి.. వైద్యులు షాక్ అయ్యారు. దీంతో శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుంచి నాణేలు తొలగించామని వైద్యులు తెలిపారు. పొట్టలో నుంచి నాణేలను బయటకు తీసి అవి ఎంత ఉన్నాయో లెక్క పెట్టారు. ఆ నాణేలలో ఐదు రూపాయల నాణేలు 56, రెండు రూపాయల నాణేలు 51, రూపాయి నాణేలు 80 చొప్పున ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి ఒకటిన్నర కిలోల బరువు ఉన్నాయన్నారు. ఆపరేషన్‌ తర్వాత ఇప్పుడు బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us