Chirutha: పెంపుడు జంతువులుగా చిరుతపులులు.. ఆ పని కోసం వాడేవారని మీకు తెలుసా..

ప్రస్తుతం చిరుతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నమీబియా నుంచి తీసుకువస్తున్న ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకురావడమే ఇందుకు కారణం. దేశంలో 70 ఏళ్ల తర్వాత

Chirutha: పెంపుడు జంతువులుగా చిరుతపులులు.. ఆ పని కోసం వాడేవారని మీకు తెలుసా..

|

Updated on: Sep 23, 2022 | 9:00 PM


ప్రస్తుతం చిరుతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నమీబియా నుంచి తీసుకువస్తున్న ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకురావడమే ఇందుకు కారణం. దేశంలో 70 ఏళ్ల తర్వాత చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. 1952లో అంతరించిపోయిన ఈ చిరుతలు దాదాపు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు వచ్చాయి. మూడు మగ, ఐదు ఆడ చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే భారతదేశంలో ఒకప్పుడు చిరుతలు అధిక సంఖ్యలో ఉండేవన్న విషయం మీకు తెలుసా? వందల సంవత్సరాల క్రితం దేశంలో సుమారు 10 వేల చిరుతలు ఉండేవి. వేటాడటం, మనుగడ కొనసాగించలేకపోవడం వంటి కారణంగా వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరికి అంతరించిపోయింది. ప్రస్తుతం చిరుతలకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మన దేశంలో చిరుతలను కూడా పెంపుడు జంతువులుగా పెంచేవారని, వాటిని వేటకు ఉపయోగించారని మీకు తెలుసా. వాస్తవానికి, మానవులు మొదట చిరుతలను వేటాడి, ఆపై వాటిని పెంపుడు జంతువులుగా మార్చేవారు. వీటి ద్వారా వివిధ రకాల జంతువులను వేటాడేందుకు ఉపయోగించారు. వైరల్ అవుతున్న వీడియోలో రెండు చిరుతలు మంచాలపై కూర్చుని ఉన్నాయి. వాటి మెడలో ఓ పట్టీ కూడా ఉంది. అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తి చిరుతకు కమాండ్స్ ఇస్తున్నాడు. తర్వాత చిరుతలను ఎడ్ల బండిలో అడవికి తీసుకెళ్లి ఇతర జంతువులను వేటాడేందుకు అక్కడ విడిచిపెడుతున్నారు. ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ క్లిప్ 1939 సంవత్సరం నాటిదిగా తెలిపారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1 లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us