Viral Video: స్కెచ్ సూపర్.. రిజల్టే వరస్ట్.. పురుగును వేటాడబోయి.. ఊహించని ప్రమాదంలో పడిన ఊసరవెల్లి..

అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది (Viral Video) అవుతోంది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ వీడియో చూసి మీరు కూడా నవ్వుకుంటారనడంలో సందేహం లేదు.

Viral Video: స్కెచ్ సూపర్.. రిజల్టే వరస్ట్.. పురుగును వేటాడబోయి.. ఊహించని ప్రమాదంలో పడిన ఊసరవెల్లి..
Chameleon Viral Video
Follow us

|

Updated on: Apr 27, 2022 | 7:00 AM

మీరు ఊసరవెల్లి(Chameleon)ని చూసే ఉంటారు. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జీవులలో ఒకటిగా పేరుగాంచాయి. ఎందుకంటే అవి రంగులు మార్చడంలో ఎంతో ప్రావీణ్యం పొందాయి. వేటగాళ్ల నుంచి తప్పించుకుని తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఊసరవెల్లులు తరచుగా రంగులు మార్చుకుని దాక్కుంటుంటాయి. అయితే, ఇతర జీవులను వేటాడంలోనూ ఇదే ట్రిక్‌ను ఫాలో చేస్తుంటాయి. ప్రపంచంలోని చాలా జంతువులు మందలుగా జీవించడానికి ఇష్టపడుతున్నప్పటికీ, ఊసరవెల్లుల విషయంలో అలా జరగదు. గుంపులుగా బతకడం కంటే ఒంటరిగా జీవించడానికే ఇష్టపడుతుంటాయి. వారి ప్రధాన ఆహారం కీటకాలు. వాటిని సులభంగా వేటాడతాయి. తమ పొడవాటి నాలుకను ఉపయోగించి ఎరను త్వరగా పట్టుకుంటాయి. అయితే, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది (Viral Video) అవుతోంది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ వీడియో చూసి మీరు కూడా నవ్వుకుంటారనడంలో సందేహం లేదు.

ఈ వీడియో ఊసరవెల్లి, అది వేటాడే కీటకానికి సంబంధించినది. నిజానికి, ఎరను చూడగానే ఊసరవెల్లి తన నాలుకకు పని చెబుతుంది. ముందుకు కదులుతూ, కీటకాన్ని వేటాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. కానీ, అక్కడే ఒక తమాషా సంఘటన జరుగుతుంది. ఓ కొమ్మపై ఊసరవెల్లి కూర్చోవడం, దాని ఎదురుగా ఓ చిన్న పురుగు పరుగెత్తడం వీడియోలో చూడొచ్చు. ఈ చిన్న కీటకాన్ని చూసి ఊసరవెల్లి సంతోషించి, దానిని పట్టుకోవడానికి తన నాలుకను చాపుతుంది. అకస్మాత్తుగా ఊసరవెల్లి తన బ్యాలెన్స్ కోల్పోయి, చెట్టు కొమ్మ నుంచి కింద పడుతుంది. పాపం, తను ఓ చిన్న కీటకాన్ని తినబోయి, అదే ప్రమాదంలోకి జారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో yournaturegram__0 పేరుతో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 25 వేల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. అయితే వందలాది మంది వీడియోను లైక్స్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల రియాక్షన్లు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Ola Electric Scooter: లక్షలు పోసి కొన్న స్కూటర్ ను తగలబెట్టిన ఓనర్.. అలా ఎందుకు చేశాడంటే..

British Woman: ఆమె వయసు99.. ఏకంగా యుద్ద విమానాన్నే నడిపింది..!

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.