Birds on Snake: పామును రౌండప్ చేసిన పక్షులు.. వెనక నుంచి ముక్కుతో పొడుస్తూ.. వీడియో మాములుగా లేదుగా..

వైల్డ్‌లైఫ్ వీడియోలు మనకు తెలియని ఆనందం కలిగిస్తాయి. బిజీ ప్రపంచంలో మనం... అప్పుడప్పుడూ నేచర్ వైపు చూస్తుంటాం. ఆ ప్రకృతిలో దృశ్యాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. తాజాగా దక్షిణాఫ్రికా డినోకెంగ్ గేమ్ రిజర్వులో ఓ చిత్రమైన దృశ్యం కనిపించింది.

Birds on Snake: పామును రౌండప్ చేసిన పక్షులు.. వెనక నుంచి ముక్కుతో పొడుస్తూ.. వీడియో మాములుగా లేదుగా..

|

Updated on: May 25, 2022 | 9:56 AM


వైల్డ్‌లైఫ్ వీడియోలు మనకు తెలియని ఆనందం కలిగిస్తాయి. బిజీ ప్రపంచంలో మనం… అప్పుడప్పుడూ నేచర్ వైపు చూస్తుంటాం. ఆ ప్రకృతిలో దృశ్యాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. తాజాగా దక్షిణాఫ్రికా డినోకెంగ్ గేమ్ రిజర్వులో ఓ చిత్రమైన దృశ్యం కనిపించింది. గడ్డి ప్రాంతంలోని మట్టి రోడ్డులో… ఓ పామును పక్షులు రౌండప్ చేశాయి. విడివిడిగా పోరాడితే… ఆ పక్షుల్లో ఒక్కటి కూడా పామును ఎదిరించే సత్తా ఉన్నది కాదు. కానీ అవి గ్రూపుగా మారాయి. తమకంటే బలమైన శత్రువు తమవైపు వస్తే… పోరాడేందుకు పక్షులు ఈ టెక్నిక్ ఉపయోగిస్తాయి. ఇక్కడ పాము తల ఎటు ఉందో చూసుకొని… ఆ తలకు వెనక ఉండే పక్షి దాడి చేస్తోంది. ఇలా పాము తల దిశ మారిన ప్రతిసారీ… ఆ వెనక ఉండే పక్షి దాడి చేస్తోంది. తద్వారా పాము తమను కాటు వెయ్యకుండా ఆ పక్షులు ప్లాన్ అమలుచేశాయి. ఓ దశలో ఆ పాము తిరగబడేందుకు ప్రయత్నించగా… పక్షులు దాడిని తీవ్రం చేశాయి. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా… ఒకటి తర్వాత ఒకటి ముక్కుతో, కాళ్ల గోర్లతో గుచ్చుతూ… నరకం చూపించాయి. చిత్రమేంటంటే ఈ పక్షుల్లో ఒకటి వేరే జాతిది కూడా ఉంది. అది కూడా ఈ గ్యాంగ్‌తో కాళ్లు కలిపి… పామును ఆటాడుకుంది. మొత్తానికి అన్నీ కలిసి… పాముని చంపేంతపని చేశాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us