Bird-Cat funny: పక్షికోసం మాటు వేసిన పిల్లి.. నీవల్ల కాదు బయలుదేరమంటూ పిల్లికి షాకిచ్చిన పక్షి.. ఫన్నీ వీడియో

సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. కొన్ని వీడియోలు చాలా వినోదభరితంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Anil kumar poka

|

Sep 18, 2022 | 8:58 AM


సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. కొన్ని వీడియోలు చాలా వినోదభరితంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో పిల్లి చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట ఓ చిన్న పక్షి గింజలు తింటూ ఉంది. దానిని ఓ పిల్లి గమనించింది. ఎలాగైనా ఆ పక్షిని తన ఆహారంగా చేసుకోవాలనుకుంది. వెంటనే వేటకు సిద్ధమైంది. అచ్చం చిరుత పులిలా పక్కనే ఉన్న చిన్న గోడ చాటున మాటు వేసింది. అయితే పక్షి గింజలు మేస్తూ అటూ ఇటూ తిరుగుతుండగా.. పిల్లి అదను చూసి ఎటాక్‌ చేద్దామని నక్కి నక్కి చూస్తుంది. ఇంతలో పక్షి ఉన్నట్లుండి.. మాటు వేసిన పిల్లి వద్దకు వచ్చింది. ఒక్కసారిగా పక్షి ఎంట్రీతో పిల్లి బిత్తరపోయింది. తొలుత పక్షిని, పిల్లి పట్టేస్తుందని అనిపించినా.. కానీ ఆ పక్షి.. ‘నాకోసమే ఇక్కడ వెయిటింగా.. నీవల్ల కాదుగానీ ఇక బయలు దేరు అన్నట్టుగా పక్షి తన ముక్కుతో పిల్లి మూతిపై పొడవగానే బెదిరిపోయిన పిల్లి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ సీన్‌ అంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అవగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పులిలా బిల్డప్ ఇచ్చిన పిల్లి చివరకు తుస్సుమనిపించిందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu