వృద్ధుడు అని కూడా చూడకుండా.. యాక్సిడెంట్ చేసి.. బైక్ తో ఈడ్చుకెళ్లి..

Phani CH

Phani CH |

Updated on: Jan 25, 2023 | 11:12 AM

కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంతో ఓ వృద్ధుడి కారును ఢీ కొట్టాడు. అంతటితో ఆగకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంతో ఓ వృద్ధుడి కారును ఢీ కొట్టాడు. అంతటితో ఆగకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. సాహిల్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంతో ముత్తప్ప అనే 71 ఏళ్ల వ్యక్తి కారును ఢీ కొట్టాడు. దీంతో ఆయన కారులో నుంచి దిగగానే యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన ముత్తప్ప.. వెంటనే అతని బైక్‌ వెనుక భాగాన్ని పట్టుకున్నాడు. అయినప్పటికీ సదరు యువకుడు బైక్ ను ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆపకుండా రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. తోటి వాహనదారులు గమనించి వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో వృద్ధుడి కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలిక బ్యాగ్ లాక్కొని పారిపోయిన దొంగ !! హీరోలా మరో బాలుడు ఎంట్రీ.. కట్‌చేస్తే ??

విమానంలో తండ్రిని చూసి కూతురు ఏ చేసిందో తెలుసా ?? హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!

ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్‌ !!

Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu