Viral Video: ఒక్క కిక్కుతో ఎగిరి గల్లాపెట్టెలో పడ్డాడు.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న నెటిజన్లు..

యాక్సిడెంట్లు అనేవి ఎవరూ ఊహించనవి.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో తెలియదు..కానీ, జరిగిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపితే.. మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి.

Viral Video: ఒక్క కిక్కుతో ఎగిరి గల్లాపెట్టెలో పడ్డాడు.. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న నెటిజన్లు..

|

Updated on: Nov 18, 2021 | 8:59 AM


యాక్సిడెంట్లు అనేవి ఎవరూ ఊహించనవి.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో తెలియదు..కానీ, జరిగిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపితే.. మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి ప్రమాదమే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

నగరంలోని రావిచెట్టు బజార్‌లో ఓ బట్టల షాపులో షాపులో కస్టమర్లు బట్టలు కొనేందుకు వెళ్లారు. వాళ్ల పనిలో వాళ్లున్నారు. ఉన్నట్టుండి సడెన్‌గా షాప్‌లోకి ఓ బైక్ దూసుకొచ్చింది. షాపు బయటినుంచి ఏదో వేగంగా వస్తోందని కండ్లు తిప్పేలోపుగానే… ఓ బైకర్‌ గుండె ఆగిపోయినంత పనిచేశాడు. పల్సర్‌ బైక్‌ మీద అతివేగంతో నేరుగా షాపులోకి దూసుకొచ్చాడు. షాపులో పేర్చిన బట్టలను ఢీ కొట్టి ఎగిరిపోయి కౌంటర్‌లో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి, బైక్‌కు ఏమీ కాకపోగా.. షాపులోని వారు తృటిలో తప్పించుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్ డ్రైవింగ్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us