Pythone Viral Video: ఇంటి వరండాలో కొండచిలువ.. ఆ ఇంటి యజమాని ఏం చేశాడో తెలుసా.?

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాము. అదే ఓ భారీ పైథాన్‌ ఎదురుపడితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఒకటికాదు రెండు కాదు నాలుగు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది.

Pythone Viral Video: ఇంటి వరండాలో కొండచిలువ.. ఆ ఇంటి యజమాని ఏం చేశాడో తెలుసా.?

|

Updated on: May 24, 2022 | 4:21 PM


పాములను చుస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాము. అదే ఓ భారీ పైథాన్‌ ఎదురుపడితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఒకటికాదు రెండు కాదు నాలుగు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ, ఆస్ట్రేలియాలోని ఓ ఇంటి వరాండలో ఏకంగా నాలుగు భారీ పైథాన్‌లు ప్రత్యక్షమయ్యాయి. కేవలం నాలుగు మాత్రమే కాదు, రెండు వారాల వ్యవధిలో ఆరు పైథాన్లు కనిపించాయి. పైగా అవి రెండు జతలుగా వచ్చి వారింటి వరాండలో సంతానోత్పత్తి జరుపుకుంటున్నట్టుగా తెలిపాడు ఆ ఇంటి యజమాని. అంతేకాదు.. అలా తన వరండాలోకి వచ్చిన పాములను పట్టుకోని కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియాలోని బుడెరిమ్‌లో చోటుచేసుకుంది. ఇంటి బాల్కనీలో ముందుగా ఓ భారీ కొండ చిలువల జంట కనిపించింది. దాన్ని చూసిన ఆ ఇంటి యజమాని ఒకింత షాక్‌ అయ్యాడు. బాల్కనీపై అల్లుకుని కనిపించిన భారీ పైథాన్‌ ఎండలో చలికాచుకుంటున్నట్టుగా పడుకుని కనిపించాయి. అంతలోనే అవి మెల్లిగా అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత చూస్తే, ఇంటి డైనింగ్‌ టేబుల్‌ వద్ద మరో జంట కనిపించింది. డైనింగ్‌ టేబుల్‌ చైర్‌పై నుండి టేబుల్‌ మీద వరకు ..అతి పొడవైనదిగా ఆ పైథాన్‌ కనిపించింది. అతడు భయపడుతూనే పైథాన్‌ను పట్టేశాడు. దాని పొడవు దాదాపు 11 అడుగులకు మించి ఉన్నట్టుగా తెలిసింది. కానీ పామును పట్టుకున్నప్పటికీ.. అతడికి ఏమాత్రం హానీ కల్గించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us