Bear cubs funny video: ఉయ్యాల ఎక్కేందుకు నానా తంటాలు పడిన . ఎలుగుబంటి పిల్లలు.. వీడియో చుస్తే నవ్వాగదు..

నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి.

Anil kumar poka

|

Jul 07, 2022 | 9:51 AM


నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి.తాజాగా ఓ ఎలుగు బంటి తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎలుగు బంటి పిల్లలు సరదాగా ఆడుకుంటూ కనిపించాయి. ఒక ఉయ్యాల పైకి ఎక్కి ఊగడానికి ఆ ఎలుగు బంటి పిల్లలు నానా తిప్పలు పడ్డాయి. ఒక చెట్టుకు కట్టి ఉన్న హామక్‌ ఉయ్యాల ఎక్కడానికి రెండు ఎలుగుబంటి పిల్లలు పడిన తిప్పలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఉయ్యాలను ఎక్కలేక కిందపడుతున్నప్పటికీ అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సుధా రామన్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనుషులే కాదు జంతువులు కూడా ఆనందంగా గడుపుతాయి. ఎ కామన్ ఇన్సిడెంట్ అమాంగ్ బేర్స్ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 9 మిలియన్ల మందికి పైగా చూశారు. చాలా మంది లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu