Food in toilet: దారుణం.. టాయిలెట్‌లో క్రీడాకారిణులకు భోజనాలు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్‌లో పాల్గొన్న బాలికలకు టాయిలెట్‌ గదిలో భోజనాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన

Food in toilet: దారుణం.. టాయిలెట్‌లో క్రీడాకారిణులకు భోజనాలు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ..

|

Updated on: Sep 27, 2022 | 9:58 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్‌లో పాల్గొన్న బాలికలకు టాయిలెట్‌ గదిలో భోజనాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ట్రంలోని సహరన్‌పుర్ జిల్లాలో సెప్టెంబర్‌ 16న అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. కాగా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన తమకు టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసారంటూ కొందరు క్రీడాకారులు ఆరోపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు పూరీలను ఓ పేపర్‌లో వేసి నేలపైనే ఉంచారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై సహరన్‌పుర్‌ క్రీడా అధికారి అనిమేశ్‌ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ‘ఛేంజింగ్‌ రూం’లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణ దశలో ఉందని, వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న ఛేంజింగ్‌ రూలో పెట్టామని సక్సేనా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..