Viral Video: సమాజంలో క్రియేటివిటీ ఉన్న వారు కోకొల్లలు అయితే ఒకప్పుడు ఈ ప్రతిభ కేవలం కొంత మందికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడున్న వారైనా తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకుంటున్నారు. అంతేకాకుండా ఇతరులు తీసే వీడియోల ద్వారా కూడా కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇలా ప్రతిరోజూ ఎన్నో ఆశ్చర్యపరిచే వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఓ డ్రైవర్ ట్యాలెంట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కారులో డ్రైవింగ్ చేస్తూ హైవేపై దూసుకుపోతున్నాడు. ఇంతలోనే ముందుగా ఒక రెడ్ కలర్ వ్యాగనార్ కారు వెళ్తోంది. అయితే కారులో సదరు వ్యక్తికి ఆ కారును చూడగానే ఏదో సందేహం వచ్చింది. దీంతో వెంటనే చేతిలో స్మార్ట్ ఫోన్‌ను తీసి ఆ కారును వీడియో తీయడం ప్రారంభించాడు. సదరు రెడ్ కలర్ కారును ఓవర్టేక్ చేయగానే ఆ డ్రైవర్ అనుమానం నిజమైంది.
View this post on Instagram
ఎందుకంటే అది కారు కాదు. కారులా కనిపిస్తోన్న ఆటో. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను వ్యాగనార్ కారుగా మార్చిన తీరు నెటిజన్లు ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ ట్యాలెంట్‌ను ప్రశంసిస్తూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..