ఇక్కడ ఓ యువకుడు మాత్రం రబ్బరులా మెలి తిప్పేస్తున్నాడు. ఎటు కావాలంటే అంటు, ఎంత కావాలంటే అంత వంచేస్తున్నాడు. ఎలా కావాలంటే అలా తిప్పేస్తున్నాడు. ఏదో బట్టలు మడతపెట్టినట్టు ఎలా అంటే అలా మడతపెట్టేస్తున్నాడు. ఆఫ్రీకాలోని గబాన్కు చెందిన జారెస్ కొంబిలా అనే ఈ యువకుడు తన ఫ్లెక్సిబుల్ బాడీ కారణంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని విన్యాసాలు చూసిన వారు ఇతని శరీరంలో ఎముకలే లేవా? అని ఆశ్చర్యపోతారు.జారెస్ కొంబిలా శరీరం చాలా ఫెక్సీ బుల్ గా ఉంటుంది. చేతులు, కాళ్లు, తల ఇలా ఏదైనా 180 డిగ్రీల కోణంలో ఏ దిశలోనైనా పూర్తిగా తిప్పేస్తాడు. యువకుడిలోని ఈ లక్షణాల కారణంగా అతడిని మంత్రగాడంటూ ఎగతాళి చేసేవారని తెలిపాడు. కానీ తానెప్పుడూ వారి వెక్కిరింపులను లెక్కచేయలేదని తెలిపాడు . అంతేకాదు, జారెస్ వృత్తి రీత్యా కాంటోర్షనిస్ట్. మన మైండ్ ఫ్లిక్సిబుల్గా ఉంటే ప్రపంచంలో ఏ పనీ మనకు కష్టం కాదని జారెస్ చెబుతాడు. అందుకు తనకు బాల్యంలో ఎదురైన అవమానాలు.. ఈరోజు తాను తెచ్చుకున్న గుర్తింపు సజీవ సాక్ష్యం అంటాడు జారెస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..