Tamota-woman: మహిళ ప్రాణం తీసిన టమోటా.. వయా ఎలుక..! ఇలాంటి కక్కుర్తి వాళ్ళు ఉంటె ఇలానే ఉంటుంది మరి…

ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే.. టైమ్ పాస్ కోసం కూడా చాలా మంది మ్యాగీ చేసుకుని,

Anil kumar poka

|

Aug 11, 2022 | 9:22 AM


ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే.. టైమ్ పాస్ కోసం కూడా చాలా మంది మ్యాగీ చేసుకుని, టీవీ ముందుకు కూర్చుని తీరిగ్గా తింటుంటారు. అయితే, ఈ మ్యాగీలో వేసిన టమోటా ఓ మహిళ ప్రాణాలు తీసింది. దాదాపు వారం రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె.. తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోరి మలాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మార్వేలోని పాస్కల్ బారీకి చెందిన రేఖా దేవి నిషాద్ అనే మహిళ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ అవడంతో.. వాటిని చంపేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎలుకల మందు తీసుకువచ్చి.. టమోటాలో పెట్టి, ఎలుకలకు ఎరగా వేసింది. ఆ తరువాత తీరికగా మ్యాగీ చేసుకుంది. అయితే, ఆ మ్యాగీలో ఏమరపాటుతో ఎలుకల మందు పెట్టిన టమోటా వేసింది. ఆ తరువాత టీవీ చూస్తూ ఆ మ్యాగీని తినేసింది. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. అది గమనించిన భర్త వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రేఖా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. రేఖ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu