Woman Rescue Sheep: ఈ మహిళ సాహసానికి సలామ్..! మూగజీవాన్ని రక్షించడంతో..

ఈ లోకంలో మనుషులతో పాటు.. మూగజీవాల ప్రాణాలు కూడా విలువైనవే. మ‌నిషి కానీ, జంతువు కానీ ఆప‌దలో ఉంటే క‌చ్చితంగా అక్కున చేర్చుకుంటాం. ఆదుకుంటాం. సాధ్యమైనంత వ‌ర‌కు ప్రాణాల‌తో ర‌క్షించేందుకు ప్రయ‌త్నిస్తాం. బుర‌ద‌లో చిక్కుకున్న ఓ గొర్రెను ఓ మ‌హిళ అలాగే ప్రాణాల‌తో కాపాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గొర్రెను ప్రాణాల‌తో కాపాడిన మ‌హిళ‌పై నెటిజ‌న్లు ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Woman Rescue Sheep: ఈ మహిళ సాహసానికి సలామ్..! మూగజీవాన్ని రక్షించడంతో..

|

Updated on: Oct 05, 2023 | 7:05 PM

ఈ లోకంలో మనుషులతో పాటు.. మూగజీవాల ప్రాణాలు కూడా విలువైనవే. మ‌నిషి కానీ, జంతువు కానీ ఆప‌దలో ఉంటే క‌చ్చితంగా అక్కున చేర్చుకుంటాం. ఆదుకుంటాం. సాధ్యమైనంత వ‌ర‌కు ప్రాణాల‌తో ర‌క్షించేందుకు ప్రయ‌త్నిస్తాం. బుర‌ద‌లో చిక్కుకున్న ఓ గొర్రెను ఓ మ‌హిళ అలాగే ప్రాణాల‌తో కాపాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గొర్రెను ప్రాణాల‌తో కాపాడిన మ‌హిళ‌పై నెటిజ‌న్లు ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఐర్లాండ్‌లోని మౌర్నె ప‌ర్వతాల్లో లిన్ అనే మ‌హిళ అడ్వెంచ‌ర్‌కు వెళ్లింది. అయితే అక్కడున్న ఓ కాలువ వ‌ద్ద బుర‌ద‌లో ఓ గొర్రె పిల్ల చిక్కుకుపోయింది. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు గొర్రె ప్రయ‌త్నించ‌డాన్ని ఆమె గమనించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆ మ‌హిళ గొర్రెను ప్రాణాల‌తో కాపాడేందుకు త‌న శ‌క్తినంతా ఉప‌యోగించింది. గొర్రె కొమ్ముల‌ను ప‌ట్టుకుని బుర‌ద‌లో నుంచి బ‌య‌ట‌కు లాగింది. అనంత‌రం అక్కడే ఉన్న కాలువ‌లోకి గొర్రెను లాక్కెళ్లి, బుర‌ద‌నంతా క‌డిగేసింది. ఆ త‌ర్వాత ఒడ్డుకు చేర్చి, గొర్రెను దాని మంద‌లోకి పంపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బుర‌ద‌లో చిక్కుకున్న గొర్రెను ఆమె ప్రాణాల‌తో కాపాడ‌డంపై నెటిజ‌న్లు ప్రశంస‌లు కురిపిస్తున్నారు. ఓ మూగ‌జీవాన్ని కాపాడినందుకు ఫిదా అయిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us