woman demand justice: న్యాయం కావాలంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ.. వైరల్‌ అవుతున్న వీడియో.

మున్సిపాలిటీ అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసింది. దుకాణం బదిలీ కోసం అధికారులు లంచం అడుగుతున్నారంటూ తన సమస్య తీరేవరకు కిందకు దిగనంటూ మారాం చేసింది.

Anil kumar poka

|

Aug 14, 2022 | 9:35 PM


మున్సిపాలిటీ అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసింది. దుకాణం బదిలీ కోసం అధికారులు లంచం అడుగుతున్నారంటూ తన సమస్య తీరేవరకు కిందకు దిగనంటూ మారాం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ చాలా సేపటి వరకు అక్కడే ఉండిపోయింది. దీంతో కలెక్టరేట్ ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది. హత్రాస్‌లోని రతన్‌కుంజ్ కాలనీ నివాసి సునీతా సింగ్, మున్సిపాలిటీలోని షాప్ నంబర్ 4 బదిలీకి సంబంధించి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. కాగా షాపు బదిలీ కోసం మున్సిపాలిటీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు ఇతర ఉద్యోగులు తనను 50 వేలు లంచం డిమాండ్ చేశారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ సునీత ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జిల్లా మెజిస్ట్రేట్‌కు తెలియజేశానని, అయినా న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చింది.కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సంబంధిత అధికారులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కిందకు దిగిన ఆ మహిళ ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి ఓవర్‌బ్రిడ్జిపై ఆందోళనకు దిగింది. దీంతో ఆ మార్గంలో వచ్చి పోయే వాహనాలకు ఆటంకం కలిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో హత్రాస్ గేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu