Gift to Mother: సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ.. అమ్మకు చిరు కానుక ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన కొడుకు..

ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. ఏ తల్లైనా కన్న బిడ్డల కోసమే తపిస్తుంది. ప్రపంచంతో సంబంధం లేనట్లు కేవలం ఇంటికే పరిమితమై కుటుంబాల కోసం చెమట దారపోస్తుంది.

Gift to Mother: సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ.. అమ్మకు చిరు కానుక ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన కొడుకు..

|

Updated on: Nov 20, 2022 | 9:58 AM


ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. ఏ తల్లైనా కన్న బిడ్డల కోసమే తపిస్తుంది. ప్రపంచంతో సంబంధం లేనట్లు కేవలం ఇంటికే పరిమితమై కుటుంబాల కోసం చెమట దారపోస్తుంది. ఇలా అమ్మ ప్రేమ గురించి ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే.. అయితే.. వాళ్లపై ప్రేమను ప్రదర్శించేందుకు బిడ్డలు చిరు కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. అలాంటి కానుకనే ఇచ్చి.. అమ్మను సర్‌ప్రైజ్‌ చేశాడు ఓ కొడుకు. ఇందుకు సంబంధించిన ఆ వీడియోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇంట్లో అమ్మ.. వంటను సిద్ధం చేస్తూ ఉంటుంది. వెనుక నుంచి వచ్చిన కొడుకు.. బంగారు గొలుసుతో వెళ్లి ఆమె మెడలో వేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఊహించని ఆ పరిణామాన్ని నవ్వుతో సరిపెట్టుకుంది ఆ తల్లి.. ఆ గొలుసును చూసుకుంటూ మురిసిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us