Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ..! గ్యారేజీ కొన్నవారికి పక్కన ఉన్నది ఫ్రీ..!

ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని

Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ..! గ్యారేజీ కొన్నవారికి పక్కన ఉన్నది ఫ్రీ..!

|

Updated on: May 14, 2022 | 9:20 PM


ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చారు కొనుగోలుదారులు. ఇంతకీ ఆ గ్యారేజీలో ఏమంత స్పెషల్‌ ఉంది అనే కదా మీ సందేహం..అక్కడికే వస్తున్నాం..యూకే లోని న్యూకాజిల్‌లో ఉంది ఈ గ్యారేజీ. దీనినే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు యజమాని. అయితే, గ్యారేజీ వెనుక ఓ టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నీస్ కోర్టు కారణంగానే దానికి విపరీతమైన డిమాండ్ వస్తోంది. వాస్తవానికి ఈ గ్యారేజీ ఉన్న ప్రదేశం బ్రిటన్‌లోని అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతం. ఈ గ్యారేజీ వెనుకాలే ఓ ప్రైవేట్ టెన్నిస్ కోర్టు ఉండటం దానికి కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా ఈ గ్యారేజీ ఉన్న ప్రాంతం ధనవంతులకు నిలయం. అనేక ప్రసిద్ధ పాఠశాలలు కూడా ఉన్నాయి. అయితే, ఓ ప్రఖ్యాత ప్రాపర్టీ selling సైట్‌లో ఈ గ్యారేజీని విక్రయానికి పెట్టారు. ఈ గ్యారేజీ ఫోటోను సైట్‌లో అప్‌లోడ్‌ చేసినప్పుడు చాలా మంది కొనుగోలుదారులు ఈ చిన్న గ్యారేజీని కొనడానికి కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాలని అనే ప్రశ్నలను లేవనెత్తారు. అయితే, ఈ సైట్ గ్యారేజీతో కూడిన టెన్నిస్ కోర్ట్ ఫోటోని చూసి.. చాలా మంది దానిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే.. ఆ గ్యారేజీని కొనుగోలు చేసిన వారు పక్కనే ఉన్న టెన్నిస్ కోర్టుకు కూడా యజమాని అవుతారు. ఆ కారణంగానే దానిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిచూపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us