Shocking Video: కదులుతున్న మెట్రో ట్రైన్ నుంచి దూకేసాడు.. వైరల్ అవుతున్న షాకింగ్‌ వీడియో..

సాధారణంగా రైలు ప్రయాణికులు స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపైన ట్రైన్‌ ఆగినతర్వాత జాగ్రత్తగా దిగుతారు. కానీ ఉన్నట్టుండి ఓ వ్యక్తికి ఏమైందో ఏమో ఒక వ్యక్తి కదులుతున్న మెట్రో రైలు నుంచి దూకేసాడు.

Anil kumar poka

|

Aug 10, 2022 | 9:07 PM


సాధారణంగా రైలు ప్రయాణికులు స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపైన ట్రైన్‌ ఆగినతర్వాత జాగ్రత్తగా దిగుతారు. కానీ ఉన్నట్టుండి ఓ వ్యక్తికి ఏమైందో ఏమో ఒక వ్యక్తి కదులుతున్న మెట్రో రైలు నుంచి దూకేసాడు. అయితే మెట్రోలో ప్లాట్‌ఫారం పై రైలు ఆగినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఈ యువకుడు మాత్రం తలుపును బలవంతంగా తీసి స్టేషన్ ప్లాట్ ఫాం పై దూకుతున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ యువకుడు మెట్రో నుంచి దూకగానే అతడు చాలా వేగంగా ప్లాట్ ఫాం పై పడిపోయాడు.వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది అతనిని లేపి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల అతనికి ప్రాణాపాయం అయితే తప్పింది కానీ, అతని ఎముకలు విరిగిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేవలం 5 సెకన్ల ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu