Baby in Floods: రియల్‌ లైఫ్‌ మేల్‌ శివగామి.! బాహుబలి సీన్ రిపీట్.. వరదలో చిక్కుకున్న పసిబిడ్డ..

ద‌ర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ.. ప్రభాస్‌ చిన్నతనంలో ఒంటి చేత్తో నీటిలో నుంచి పైకి లేపే సీన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది.

Baby in Floods: రియల్‌ లైఫ్‌ మేల్‌ శివగామి.! బాహుబలి సీన్ రిపీట్.. వరదలో చిక్కుకున్న పసిబిడ్డ..

|

Updated on: Jul 17, 2022 | 8:11 PM


ద‌ర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ.. ప్రభాస్‌ చిన్నతనంలో ఒంటి చేత్తో నీటిలో నుంచి పైకి లేపే సీన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ జ‌నాల హృద‌యాల‌కు హ‌త్తుకుపోయింది. అయితే ఇప్పుడు అలాంటి సీనే తెలంగాణ‌లోని పెద్దపల్లిలో చోటు చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పెద్దప‌ల్లి జిల్లా మంథ‌నిలోని చాలా ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఆ వ‌ర‌ద‌ల్లో ఓ మూడు నెల‌ల బాలుడు, అత‌డి కుటుంబం చిక్కుకుపోయింది. దీనిపై స‌మాచారం అందుకున్న గ‌జ ఈత‌గాళ్లు ఆ బాలుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. ఓ బుట్టలో పడుకోబెట్టి.. ఆ బుట్టను ఓ గజ ఈతగాడు తన నెత్తిన పెట్టుకుని.. గొంతు వరకు ఉన్న వరద నీటిలో చిన్నగా ముందుకు కదిలాడు. ఓ చేతితో తల మీద ఉన్న బుట్టిని పట్టుకుని, మరో చెత్తో.. బాలుడి తల్లిని ఆమె భర్తను పట్టుకుని నీటిని దాటించి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నువ్వు రియల్‌ లైఫ్‌ శివగామివి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Follow us