రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు.. స్వయంగా పాట రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి ఆలపించిన సిస్టర్స్..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు.. స్వయంగా పాట రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి ఆలపించిన సిస్టర్స్..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 5:12 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుల నిరసనలకు పలువురు ప్రముఖులు, సెలబ్రెటీల నుంచి మద్ధతు పెరుగుతూనే ఉంది. తాజాగా రైతుల నిరసనకు మద్ధతిస్తూ ఇద్దరు అక్కాచెల్లెల్లు నిలిచారు. అందుకోసం స్వయంగా పాట రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి వారే పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

మొహాలీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లు హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్‏లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిన సిమృత, రమ్‏నీక్ ఈ పాటను ఆలపించారు. సున్ దిలియే ని సున్ దిలియే అంటూ ఈ పాట సాగింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతులు క్రియేట్ చేసిన సాంగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. “ఈ పాట ఇంత పాపులర్ అవుతుందని మేం ఊహించలేదు. సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాకు సహకరించినవారికి ధన్యావాదాలు. ఈ ఉద్యోమంలో పాల్గొంటున్న నాయకులు ఈ పాటను ఎంతోగానే ఇష్టపడడం చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు ఈ అక్కాచెల్లెల్లు.

Also Read: డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్