మాయదారి గుండె పోటు.. 15 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది వీడియో

Updated on: Oct 26, 2025 | 3:45 PM

విజయవాడలోని జగ్గయ్యపేటలో 15 ఏళ్ల గోలి వెంకట గణేష్ గుండెపోటుతో మృతి చెందాడు. ట్యూషన్‌కు వెళ్తుండగా సైకిల్‌పై నుంచి పడి అక్కడికక్కడే మరణించాడు. కోవిడ్ తర్వాత చిన్న వయసు వారిలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెడు జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం వంటివి ప్రమాద కారకాలుగా గుర్తించారు.

విజయవాడలోని జగ్గయ్యపేటలో 10వ తరగతి చదువుతున్న గోలి వెంకట గణేష్ (15) గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తుండగా గుండెనొప్పితో కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొద్దికాలం క్రితం తండ్రిని కోల్పోయిన ఈ కుటుంబానికి వెంకట గణేష్ ఆసరా అవుతాడని ఆశించారు. అతని అకాల మరణంతో చెల్లి, తల్లి గుండెలవిసేలా విలపించారు. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా కోవిడ్ తర్వాత గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, పాడుతూ కూడా గుండెపోటుకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో