పెళ్లి కొడుకు రాలేదని.. ఆగిపోయిన రైలు

పెళ్లి కొడుకు రాలేదని.. ఆగిపోయిన రైలు

Phani CH

|

Updated on: Nov 23, 2024 | 8:18 AM

పెళ్లి కొడుకు కోసం బస్సులు ఆపిన సందర్భాలు చూశాం. కానీ, ఓ రైలు ఆగడం మాత్రం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ అరుదైన ఘటన. ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడి వివాహం అస్సాంలోని గువాహటి అమ్మాయితో నిశ్చయమైంది. చంద్రశేఖర్ ఈ నెల 14న 34 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి 15న హౌరా చేరుకుని అక్కడి నుంచి గువాహటి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.

అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది. ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గువాహటి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. చంద్రశేఖర్‌కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వేశాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వచ్చే వరకు హౌరాలో సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరైఘట్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వేశాఖకు, అధికారులకు చంద్రశేఖర్ థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి సేవలందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వే బదులిచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది.. ల్యాబ్‌ మేడ్‌ గోల్డ్‌.. బంగారం కాదన్నా మీరు నమ్మలేరు

క్రూర మృగాలతో మైక్‌ టైసన్‌ చెలగాటం

గాలిని అమ్మడం ఏందిరా బాబు !! రూ.1,000కి టిన్ను గాలా ??

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల క్యాష్‌

వ్యవసాయంలో కొత్త ట్రెండ్.. పంట దొంగలకు సూరీడుతో చెక్