ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణకు వైసిపి మాజీ ఎంపి విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. ముందుగా గురువారంనాటు సిట్ విచారణకు హాజరు అవుతానని తెలిపినప్పటికీ, చివరి నిమిషంలో హాజరు కాకపోవడం గమనార్హం. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ ఆయనను విచారణకు పిలిచింది.