మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ బీజేపీ, హిందూ సంఘాలు ప్రకటించాయి. ఆచారాలు పాటించాలని కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అటు జగన్‌పై బౌతికదాడికి కుట్ర జరుగుతుందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.