కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటోలు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.