మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ హనుమాన్ నగర్లో పాత కక్షల నేపథ్యంలో కత్తుల దాడి జరిగింది. నిఖిల్ అనే యువకుడు చందు, నాగరాజులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు నిఖిల్ను అదుపులోకి తీసుకున్నారు.