హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురలో గొర్రెలకు ఆకులు కోసుకునేందుకు వెళ్ళిన యువకుడు ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడు. స్థానికులు , ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే తక్షణం స్పందించి నిచ్చేన, తాడు సహాయంతో యువకుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్పొరేటర్ చొరవకు ప్రశంసలు లభించాయి.