విశాఖపట్నం సాగరతీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 3 లక్షల మందికి పైగా పాల్గొని యోగాసనాలు చేశారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీని చంద్రబాబు నాయుడు సన్మానించగా.. పవన్ ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.