ఉదయం సూర్యనమస్కారం చేయడం వల్ల మహిళలకు అనేక ప్రయోజనాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం మెరుగవుతుంది. ఎముకలు, కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పురుషులకన్నా మహిళలకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం సూర్యనమస్కారం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవచ్చు.