యానాంలో రెండు కిలోల పులస చేప రూ. 26,000లకు వేలంలో అమ్ముడుపోయింది. వానకాలం ప్రారంభం కావడంతో గోదావరిలో పులస చేపల రాక మొదలైంది. సోమవారం రూ. 18,000, మంగళవారం రూ. 22,000 ధర పలికిన పులస బుధవారం రికార్డు ధరను తాకింది. మత్స్యకారులు రానున్న రెండు నెలల్లో మరింత పులస చేపలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.