బనగానపల్లె పట్టణంలోని ప్రధాన రహదారిపై గురువారం ఉదయం చేతబడి కలకలం రేపింది. చెక్క బొమ్మ, పసుపు, కుంకుమ, చిల్లర నాణేలు, పూలతో చేతబడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.