అనంతపురం జిల్లా గుంతకల్లో చిట్ ఫండ్ మోసం వెలుగు చూసింది. చిట్టీ డబ్బులు ఎగ్గొట్టి, బెదిరింపులకు పాల్పడిన దిల్షా బేగం అనే నిర్వాహకురాలిని బాధితులైన మహిళలు చితకబాదారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.