కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని బ్రహ్మానందం అండ్ సన్స్ నగల దుకాణంలో పట్టపగలు దొంగతనం జరిగింది. నలుగురు మహిళలు వెండి గొలుసులు కొనుగోలు చేసేందుకు వచ్చి, దుకాణ యజమాని కళ్ల ముందే రూ.1,50,000 విలువైన వెండి గొలుసులను దొంగతనం చేశారు.