Morning Walk in Winter: చలికాలంలో ఉదయం పూట నడవడం సాధారణంగా మంచిదే. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే, ఉబ్బసం, అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సరైన వెచ్చని దుస్తులు ధరించి, వామప్లు చేయడం వల్ల గాయాలు, జలుబులు రాకుండా నివారించవచ్చు. శరీరం చురుగ్గా ఉన్న సమయంలో నడకను ఎంచుకోవడం ఉత్తమం.