హార్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్, యూఏఈల మధ్య విస్తరించి ఉంది. అయితే, సముద్రంలో అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల నౌకలు ఇరాన్ జలాల నుంచే ప్రయాణించాల్సి వస్తోంది. ఇదే ఇరాన్‌కు జలసంధిపై వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతానికి 700 నుంచి 1000 నౌకలు ఇరాన్ చర్యల వల్ల చిక్కుకుపోయాయి.