చలికాలంలో గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట చలి, కొన్ని హార్మోన్ల పెరుగుదల గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వార్మప్ లేకుండా వ్యాయామాలు, సరైన దుస్తులు ధరించకపోవడం వల్ల గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది.