దుబాయ్ బంగారానికి, మన భారతీయ బంగారానికి రంగులో తేడా ఎందుకు ఉంటుందో తెలుసా? బంగారం రంగు దానిలో కలిపే ఇతర లోహాలపై ఆధారపడి ఉంటుంది. జింక్, వెండి కలిపిన దుబాయ్ బంగారం ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండగా, రాగి కలిపిన భారతీయ బంగారం ఎరుపు ఛాయతో కనిపిస్తుంది. యూరోప్, యూఎస్ బంగారాలు లేత రంగులో ఉంటాయి.