తెలంగాణను షేక్ చేస్తోన్న హైడ్రాపై తీవ్రవ్యాఖ్యలు చేసింది..హైకోర్టు. హైడ్రాకున్న చట్టబద్ధతను ప్రశ్నించిన ధర్మాసనం.. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులను హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది కోర్టు.