తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వే గురించే చర్చ. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్, బోగస్ ఓట్లను తొలగించి, మరణించిన వారి పేర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ వివరాలు, దీని వల్ల ఓటర్లకు కలిగే ప్రయోజనాలు, ఓటు హక్కును కోల్పోకుండా చూసుకునే మార్గాలను ఈ సర్వే తెలియజేస్తుంది.